కాత్య్సాయనీ.. శుభకరీ..
దేవీ నవరాత్రుల్లో భాగంగా జిల్లాలోని అమ్మవార్లు శుభాలను ఒసగు కాత్యాయని, మహాగౌరి తదితర అలంకరణల్లో బుధవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. కొన్నిచోట్ల అమ్మవార్లను రూ.లక్షలతో ధనలక్ష్మీగా అలంకరణ చేశారు. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుని తరించారు.