చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు | china venkanna hund income counting | Sakshi
Sakshi News home page

చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు

Published Wed, Dec 21 2016 10:41 PM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM

చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు - Sakshi

చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఏడు రోజులకు గాను నగదు రూపంలో రూ.37,29,587, కానుకుల రూపంలో 83 గ్రాముల బంగారం, 971 గ్రాముల వెండి లభించినట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా అధికంగా లభించిందని చెప్పారు. 
పాతనోట్ల తిరస్కరణ
హుండీల ఆదాయంలో ప్రభుత్వం రద్దు చేసిన 476 రూ.1,000, 535 రూ.500 నోట్లు వచ్చాయి. వీటి మొత్తం రూ.7,43,500 ఉంది. అయితే స్థానిక ఆంధ్రాబ్యాంకు అధికారులు మాత్రం ఈ నోట్లను జమచేసేందుకు అంగీకరించలేదు. ఈనెల 30న ఒకేసారి ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని బ్యాంకు అధికారులు సూచించారని, దీంతో హుండీ ఆదాయాన్ని రూ.29,86,083గా చూపినట్లు ఈవో చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement