పశ్చిమ డెల్టాకు ఆరువేల క్యూసెక్కులు
పశ్చిమ డెల్టాకు ఆరువేల క్యూసెక్కులు
Published Wed, Oct 12 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం ఆరువేల క్యూసెక్కుల నీరు వదులుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీనిలో ఏలూరు కాలువకుS 1,120, ఉండి కాలువకు 1,423, నరసాపురం కాలువకు 1,983, జీ అండ్ వీ కాలువకు 763, అత్తిలి కాలువకుS 484 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
మళ్లీ పెరిగిన గోదావరి వరద
ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండడంతో గోదావరికి మళ్లీ వరదపోటు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం బు«ధవారం గరిష్టంగా 9.60 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటలకు 4,69,948 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో సాయంత్రం ఆరు గంటలకు 5,00,339 క్యూసెక్కులకు పెరిగింది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 11,700 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాలకు వదులుతుండగా, 4,88,639 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం, ర్యాలీ ఆర్మ్‌ల్లోని 103 గేట్లను 1.20 మీటర్లు, మద్దూరు ఆర్మ్‌లోని 23 గేట్లను మీటరున్న ఎత్తు, విజ్జేశ్వరం ఆర్మ్‌లోని 39 గేట్లను మీటరు ఎత్తులేపి వ రద నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 33.70 అడుగులున్న నీటిమట్టం నెమ్మదిగా తగ్గుతూ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 31.60 అడుగులకు తగ్గింది. దీంతో దిగువన ఉన్న పోలవరం, కొవ్వూరు, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వదర ఉధృతి కనిపిస్తుంది.
Advertisement