at dwaleswaram
-
పశ్చిమ డెల్టాకు ఆరువేల క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం ఆరువేల క్యూసెక్కుల నీరు వదులుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీనిలో ఏలూరు కాలువకుS 1,120, ఉండి కాలువకు 1,423, నరసాపురం కాలువకు 1,983, జీ అండ్ వీ కాలువకు 763, అత్తిలి కాలువకుS 484 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మళ్లీ పెరిగిన గోదావరి వరద ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండడంతో గోదావరికి మళ్లీ వరదపోటు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం బు«ధవారం గరిష్టంగా 9.60 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటలకు 4,69,948 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం ఆరు గంటలకు 5,00,339 క్యూసెక్కులకు పెరిగింది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 11,700 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాలకు వదులుతుండగా, 4,88,639 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం, ర్యాలీ ఆర్మ్ల్లోని 103 గేట్లను 1.20 మీటర్లు, మద్దూరు ఆర్మ్లోని 23 గేట్లను మీటరున్న ఎత్తు, విజ్జేశ్వరం ఆర్మ్లోని 39 గేట్లను మీటరు ఎత్తులేపి వ రద నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 33.70 అడుగులున్న నీటిమట్టం నెమ్మదిగా తగ్గుతూ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 31.60 అడుగులకు తగ్గింది. దీంతో దిగువన ఉన్న పోలవరం, కొవ్వూరు, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వదర ఉధృతి కనిపిస్తుంది. -
వరద గోదావరి
కొవ్వూరు : గోదావరి వరద తీవ్రత 3 రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. ఎగువ భద్రాచలంలో నీటిమట్టం మంగళవారం మధ్యాహ్నం నుంచి క్రమేణా పెరుగుతోంది. ఉదయం ఆరు గంటలకు 31.30 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం ఆరుగంటలకు 36.90 అడుగులకు పెరిగింది. దీంతో దిగువనున్న పోలవరం, కొవ్వూరు, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద తీవ్రత బుధవారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 8 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట వద్దకి 3,83,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 10,400 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. ఆనకట్టకు నాలుగు ఆర్మ్్సలో ఉన్న 175 గేట్లును మీటరు ఎత్తులేపి 3,72,810 క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం నుంచి ఇన్ఫ్లో మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
గోదావరి వరద తగ్గుముఖం
కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలో నీటి మట్టాలు క్రమేణా తగ్గుతున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 5,46,150 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం ఆరు గంటలకు 4,30,682 క్యూసెక్కులకు తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 5,800 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మిగిలిన 4,24,882 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువున భద్రచలంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు 35.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం 30.50 అడుగులకు తగ్గింది. ఇప్పటి వరకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గేట్లు పూర్తిగా ఎత్తివేసిన అధికారులు వరద తీవ్రత తగ్గడంతో గేట్లు నియంత్రణలో పెట్టారు. ధవళేశ్వరం ఆర్మ్ వద్ద ఉన్న 70 గేట్లలలో 30 గేట్లను అరమీటరు ఎత్తు, 40 గేట్లను మీటరు ఎత్తులేపారు. ర్యాలీలో 43, మద్దూరులోని 23 గేట్లును 1.50 మీటర్లు ఎత్తు, విజ్జేశ్వరం ఆర్మ్లోని 39 గేట్లును మీటరు ఎత్తులేపి వరద నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకి శుక్రవారం సాయంత్రం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ఏలూరు కాలువకు 379, నరసాపురం కాలువకు 304,, జీఅండ్వీ కాలువకు 231, అత్తిలి కాలువకు 204 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచిపెడుతున్నారు. ఉండి కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. -
పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కులు విడుదల
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి 7 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. జిల్లాలో ఏలూరు కాలువకి 1,180 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,714, నరసాపురం కాలువకి 2,020, గోస్తనీ (జీఅండ్ వీ)కి1,035, అత్తిలి కాలువకి 578 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 13,800 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరుగంటలకు గోదావరి నుంచి 3,57,496 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సాయంత్రానికి కాస్త ఇన్ఫ్లో తగ్గడంతో ఆరుగంటల నుంచి 2,54,048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 10.20 అడుగులుగా నమోదైంది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లును అరమీటరు ఎత్తు లేపి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రచలంలో నీటిమట్టం 24 అడుగులకు తగ్గింది. దీంతో రానున్న రెండు రోజుల్లో వరద తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.