నేటి నుంచి జేవీవీ సైన్స్ సంబరాలు
Published Thu, Nov 10 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
ఉండి : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్టు వేదిక జిల్లా నాయకుడు గాదిరాజు రంగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉండిలో జేవీవీ సైన్సు సంబరాల పోస్టర్‌ను డీవైఈవో మద్దూరి సూర్యనారయణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా డీవైఈవో మాట్లాడుతూ సైన్సుపై విద్యార్థులకు మక్కువ కలిగించడంలో జేవీవీ కృషి అభినందనీయమని అన్నారు. 26 సంవత్సరాలుగా సైన్సుపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు చెకుముకి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రంగరాజు తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జెడ్పీ హైస్కూళ్లలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వేదిక శాఖ మండల ప్రధాన కార్యదర్శి దాసరి సునీల్‌కుమార్, నిమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement