ఉల్లి మార్కెట్‌లో జేసీ ఆకస్మిక తనిఖీలు
Published Thu, Nov 17 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
తాడేపల్లిగూడెం రూరల్ : పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లోని ఉల్లిపాయల గోదాములు, విక్రయ కేంద్రాల్లో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఉల్లి విక్రయాలు, కాటా, నిల్వల గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, పాత నోట్లు కూడా తీసుకుంటున్నట్టు వ్యాపారులు జేసీకి చెప్పారు. అనంతరం జేసీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉల్లి కొరత ఉంటే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని, వ్యాపారులు సహకరించాలని కోరారు. జిల్లాలో ఉల్లిపాయలు, నిత్యావసర సరుకులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వ్యాపారులు తీసుకురావద్దని సూచించారు. ఆయన వెంట డీఎస్‌ఓ డి.శివశంకర్‌రెడ్డి, తహíసీల్దార్ పాశం నాగమణి, సీఎస్‌డీటీ రమణ ఉన్నారు.
Advertisement
Advertisement