వైవీయూ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం జాబ్‌మేళా జరగనుంది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డా. ఎన్.సుబ్బనరసయ్య, జేకేసీ కోఆర్డినేటర్ డా. ఎం. రమేష్ తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్‌మెంట్ (ఐఎల్‌ఎం) ఆధ్వర్యంలో జూనియర్ ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2016లో పాసైన విద్యార్థులతో పాటు ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న వారు ఈ ఎంపికలకు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 9490701588 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
నేడు జాబ్‌మేళా
Published Tue, Dec 13 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
Advertisement
Advertisement