ప్రైవేట్ వైద్యుల ‘సత్యాగ్రహం’
Published Thu, Nov 17 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపుమేరకు బుధవారం జిల్లాలో నర్సింగ్ హోంలు, క్లినిక్‌లను మూసివేసి వైద్యులు సత్యాగ్రహం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రామచంద్రరావుపేటలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏలూరు డాక్టర్ల బృం దం ఎంపీ మాగంటి బాబుకు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆచరణయోగ్యం కాని చట్టాలను అమలు చేస్తోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌ను రద్దు చేయడం తగదని వైద్యులు అన్నారు. నకిలీ డాక్టర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇటువంటి స్థితిలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు మూ సి సత్యాగ్రహం చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో ఐఎంఏ ఏలూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ కానాల మద్దేశ్వరరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు, కోశాధికారి డాక్టర్ డి.సుబ్బారావు, డాక్టర్ యుగంధర్, డాక్టర్ మానం పద్మనాభం, డాక్టర్ దిరిశాల వరప్రసాద్ పాల్గొన్నారు.
రోగుల ఇబ్బందులు
నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు, నర్సింగ్ హోంలు బంద్ పాటించడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో దాదాపు 150 మంది వైద్యు లు తమకు చెందిన సుమారు 60 ఆసుపత్రులను మూసివేసి ఆందోళనలో పాల్గొనడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆయా ఆసుపత్రులకు వచ్చిన అత్యవసర రోగులు జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రులకు పరుగులు తీయా ల్సి వచ్చింది. నగరంలోని వైద్యులు మ ధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేసి సా యంత్రానికి గాని వైద్యసేవలు ప్రారంభించకపోవడంతో ఆయా ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లకు నర్సులు, కాంపౌండర్లు సేవలు అందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఉసూరుమన్నారు.
Advertisement
Advertisement