హెల్మెట్ ప్రాణానికి రక్ష
Published Thu, Jan 26 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
ఏలూరు అర్బన్ : హెల్మెట్ ద్విచక్రవాహనదారుల ప్రాణానికి రక్ష అని ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ భధ్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక అమీనాపేట రిజర్వ్ పోలీసు క్వార్టర్స్ సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. ఇటీవల కాలంలో యువకులు అదుపులేని వేగంతో వాహనాలు నడుపుతున్నారని, ఇది తగదని సూచించారు. అనంతరం పోలీసులు హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వలిశల రత్న, డీఎస్పీలు గోగుల వెంకటేశ్వరరావు, పి.భాస్కరరావు, ఎన్.చంద్రశేఖరరావు, ఓఎస్డీ బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement