ఏలూరు కాలువలో పడి వ్యక్తి మృతి | a person died to felt in eluru canal | Sakshi
Sakshi News home page

ఏలూరు కాలువలో పడి వ్యక్తి మృతి

Published Wed, Aug 31 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

నారాయణపురం వద్ద ఏలూరు ప్రధాన కాలువలో బుధవారం ఓ మృతదేహాన్ని చేబ్రోలు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం వల్లూరిపల్లి గ్రామానికి చెందిన మర్లపూడి చెంచయ్య(46) మంగళవారం బాదంపూడి హైవే పక్కన ఉన్న చర్చికి వచ్చారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏలూరు కాలువ గట్టు వద్దకు వెళ్లగా.. జారిపడి గల్లంతయ్యాడు. ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు.

నారాయణపురం(ఉంగుటూరు) : నారాయణపురం వద్ద ఏలూరు ప్రధాన కాలువలో బుధవారం ఓ మృతదేహాన్ని చేబ్రోలు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం వల్లూరిపల్లి గ్రామానికి చెందిన మర్లపూడి చెంచయ్య(46) మంగళవారం బాదంపూడి హైవే పక్కన ఉన్న చర్చికి వచ్చారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏలూరు కాలువ గట్టు వద్దకు వెళ్లగా.. జారిపడి గల్లంతయ్యాడు.  ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. బుధవారం ఉదయం నారాయణపురం వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది మర్లపూడి చెంచయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై చావా సురేష్‌ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement