కొయ్యేటిపాడు (పెనుమంట్ర) : ఆచంట నియోజకవర్గవ్యాప్తంగా మరింత మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సాఆర్ కాంగ్రెస్‌లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ అన్నారు.
వైఎస్సార్ సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక
Published Wed, Aug 24 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
కొయ్యేటిపాడు (పెనుమంట్ర) : ఆచంట నియోజకవర్గవ్యాప్తంగా మరింత మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సాఆర్ కాంగ్రెస్‌లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ అన్నారు. పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో బుధవారం జరిగిన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నేతల దానయ్య, పమ్మి శ్రీనివాసు, కుసుమే స్వామి, లూథర్, జి.నరసింహరావు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్, జిల్లా నాయకులు దాట్ల త్రిమూర్తిరాజు, పెనుమంట్ర, పెనుగొండ, మండలాల పార్టీ కన్వీనర్లు కర్రి వేణుబాబు, దంపనబోయిన బాబూరావు, కర్రి సత్యనారాయణరెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు వెలగల వెంకట రమణ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దొంగ దుర్గాప్రసాద్, ఉన్నమట్ల మునిబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రా రవికుమార్, అల్లం బులిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement