సాధికార సర్వేకు సహకరించండి
నిడమర్రు : సాధికార సర్వే నూరుశాతం పూర్తయ్యేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని మండల ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ వై. ఆనంద్ కుమారి చెప్పారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్మార్ట్ పల్స్ సర్వేపై ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆనంద్‌కుమారి మాట్లాడుతూ ఈనెల 13 వరుకూ ఈ స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు ఎం.సుందర్‌రాజు, ఎంపీడీవో డి.దామోదరావు, డీటీ ఎస్‌ఎం ఫాజిల్, ఎంపీపీ నిమ్మల మాణిక్యాలరావు, జెడ్పీటీసీ సభ్యులు వి.దివాకరరావు, వైస్ ఎంపీపీ టి.నక్షత్రం తదితరులు పాల్గొన్నారు.