ప్రత్యేకహోదాపై యూత్ ప్రచారం
పెనుగొండ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని సర్కారు కొన్ని కుయుక్తులు పన్నినా యూత్ మాత్రం పోరుబాట వీడ లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పెనుగొండలో పెనుగొండ యూత్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక హోదా స్టిక్కర్లను బుధవారం వాహనాలకు అతికించారు. ప్రత్యేక హోదా వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం సాగించాలంటూ ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఒకరకంగాను, ఎన్నికల అనంతరం ఒక రకంగాను వ్యవహరిస్తున్నాయంటూ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఐకమత్యంగా పోరాడితేనే ప్రత్యేక హోదా సాధించగలమని అన్నారు. కార్యక్రమంలో పెనుగొండ యూత్ సభ్యులు కడలి పురుషోత్తం, కానూరి అర్జునరావు, గుర్రాల శ్రీనివాసరావు, ఎస్‌ఎంఆర్ రఫీ, సుందర కనకరాజు, ఘంటసాల శివ పాల్గొన్నారు.