చిన్నారుల స్టెప్పులు అదిరే..
చిన్నారుల స్టెప్పులు అదిరే..
Published Wed, Apr 5 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
ఏలూరు సిటీ : స్ధానిక ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్ 13వ వార్షి కోత్సవం బుధవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో స్ఫూర్తి అవార్డులు కైవసం చేసుకోవడం అభినందనీయమని, విద్యా సంస్థల విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. పాఠశాల డైరెక్టర్ కె.మదనమోహనరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని సీహెచ్ సత్య శారద, విద్యావేత్త బొమ్మి అచ్యుతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement