పరుగుల చాంపియన్ భీమవరం జట్టు
భీమవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంతర కళాశాలల, యూనివర్శిటీ జట్టు క్రాస్ కంట్రీ(పురుషులు, మహిళలు) పరుగు పందెం ఎంపిక పోటీల్లో ఓవరాల్ చాంపియన్ షిప్(పురుషుల విభాగం)ను భీమవరం డీఎన్నార్ కళాశాల జట్టు గెలుచుకుంది. మహిళల విభాగంలో కాకినాడలోని ఏఎస్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల విజేతగా నిలిచింది. బుధవారం స్థానిక విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని డిగ్రీ కళాశాలలో ఈ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అక్టోబర్‌లో మంగళూరులో నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ తరపున పాల్గొంటారని క్రీడా సంచాలకుడు కె.సత్యనారాయణ తెలిపారు.
ఈ పోటీల్లో పురుషులకు 12.5 కిలోమీటర్లు, మహిళలకు 6 కిలోమీటర్లు పరుగు పందెం నిర్వహించగా 90 మంది పురుషులు 20 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్‌వీ శ్రీనివాస్, ఎంసీఏ ప్రిన్సిపాల్ ఐఆర్‌కే రాజు, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులకు అక్టోబర్‌లో బీవీ రాజు కళాశాలలో శిక్షణ శిబిరం నిర్వహించి సౌత్‌జోన్ టోర్నమెంట్‌కు తీసుకెళతామని కళాశాల పీడీ జీవీ పవన్‌కుమార్ రాజు తెలిపారు.
సౌత్‌జోన్ పోటీలకు ఎంపికైంది వీరే..
పురుషుల జట్టు: ఎన్.జగన్మోహనరావు, బి.రాజేష్, ఎన్.వెంకటేష్ (డీఎన్నార్ కళాశాల, భీమవరం), యు.రమేష్ (ఎస్‌కేవీటీడీ, రాజమహేంద్రవరం), ఎన్.నవీన్‌కుమార్ (సీఆర్‌రెడ్డి, ఏలూరు), పి.అంజిబాబు (ఎస్‌వీడీ, భీమడోలు), వై.గోవిందరాజు(ఎస్‌ఎస్‌ఆర్‌డీ కళాశాల, జంగారెడ్డిగూడెం)
మహిళల జట్టు : కె.దేవి (ఎస్‌ఆర్‌కే, రాజమహేంద్రవరం), బి.వెంకటలక్ష్మి (ఎస్‌వీడీ భీమడోలు), సీహెచ్ కవిత(బీహెచ్‌ఎస్‌ఆర్‌యూఎల్‌ఎం అండ్ పీజీఆర్ కాలేజ్ దేవరపల్లి), ఎ.వెంకటలక్ష్మి (ఎస్‌కేవీటీడీ రాజ మహేంద్రవరం), ఎం.వనజకుమారి(ఎస్‌డీజీడీసీ, కాకినాడ)