ప్రతి రైతుకు రుణాలు అందించండి
ఏలూరు (మెట్రో): జిల్లాలో రుణ అర్హత కార్డులు కలిగి అవసరమైన ప్రతి రైతుకూ రుణాలు అందించి ఆదుకోవాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు.
ఏలూరు (మెట్రో): జిల్లాలో రుణ అర్హత కార్డులు కలిగి అవసరమైన ప్రతి రైతుకూ రుణాలు అందించి ఆదుకోవాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, పశుసంవర్ధక, ఏపి డైయిరీ, ఉద్యానవనశాఖ, మత్స్యశాఖ ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రుణ అర్హత కార్డులు కలిగిన రైతులకు రుణాలు ఇవ్బందలో బ్యాంకు అధికారులు ఆసక్తి కనబరచడం లేదనీ, తమకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రైతులు ఆరోపణలు చేస్తున్నారనీ ఈ నేపథ్యంలో రైతులకు సకాలంలో రుణాలందించి ఆదుకోవాలని చెప్పారు. ఖరీఫ్ మొదలు కావడంతో రైతులు వారి పంటలకు పెట్టుబడులు పెట్టే సమయం ఇదేననీ, వారికి రుణాలిచ్చి వడ్డీ వ్యాపారుల నుండి కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బిందు సేద్యం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనీ, క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను కలిసి వారికి అవగాహన కల్పించాలని కలెకరు భాస్కర్ చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖల రైతుల వివరాలను నమోదు చేసే సమయంలో అర్హులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రాధాన్యతా రంగాల అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.