ఉక్కుపాదం
ఏలూరు (సెంట్రల్) : జిల్లాలోహాస్టళ్ల ఎత్తివేతను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించి.. పోలీస్ స్టేష¯Œæకు తరలించారు.
ఏలూరు (సెంట్రల్) : జిల్లాలోహాస్టళ్ల ఎత్తివేతను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించి.. పోలీస్ స్టేషకు తరలించారు.
..జిల్లాలో సంక్షేమ వసతి గృహాల మూతివేతకు నిరసనగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది.
హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై విద్యార్థులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఈనెల 25న చలో విజయవాడకు పిలుపు ఇస్తామని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవికుమార్, కారుమంచి క్రాంతిబాబు,వి.మహేష్, పిల్లి తులసీ, కాగిత అనిల్, జి.నాగబాబుతో సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశా రు. అనంతరం సొంత పూచీకత్తులపై వి డుదల చేశారు.