తణుకులో పట్టపగలే చోరీ | robbery in tanuku | Sakshi
Sakshi News home page

తణుకులో పట్టపగలే చోరీ

Published Wed, Oct 26 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

robbery in tanuku

తణుకు : స్థానిక బ్యాంకు కాలనీలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది.  ఇంట్లో బీరువాలో దాచుకున్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీనివాస టవర్స్‌లో నివాసం ఉంటున్న రవీంద్రతేజ బాదంపూడి రైల్వే సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య యర్రాయిచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. బుధవారం ఉదయం వారు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు.  మధ్యాహ్నం వీరి కుమార్తె స్కూలు నుంచి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. పడకగదిలో బీరువా తెరిచి ఉంది. అందులో సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement