in house
-
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
తనకల్లు : మండలంలోని చీకటిమానిపల్లి వద్ద ఓ లారీ ఆదివారం అదుపు తప్పి ఇంట్లోకి దూసికెళ్లింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని సేలంకు చెందిన ఓ లారీ అనంతపురానికి బయలుదేరింది. మార్గమధ్యంలోని చీకటిమానిపల్లి సమీపలో గల మలుపు వద్దకు రాగానే అదుపు తప్పడంతో జాతీయ రహదారికి ఆనుకునే ఉన్న శేఖర్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని గ్రామస్తులు తెలిపారు. అయితే ఘటనలో లారీ డ్రైవర్ తిరుమల మురుగన్‌కు రెండు కాళ్లు విరిగిపోయాయి. చికిత్స కోసం క్షతగాత్రున్ని 108లో కదరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తణుకులో పట్టపగలే చోరీ
తణుకు : స్థానిక బ్యాంకు కాలనీలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లో బీరువాలో దాచుకున్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీనివాస టవర్స్‌లో నివాసం ఉంటున్న రవీంద్రతేజ బాదంపూడి రైల్వే సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య యర్రాయిచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. బుధవారం ఉదయం వారు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం వీరి కుమార్తె స్కూలు నుంచి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. పడకగదిలో బీరువా తెరిచి ఉంది. అందులో సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పట్టపగలు చోరీ
బుట్టాయగూడెం : మండలంలోని ముప్పినవారిగూడెం ఎస్సీ కాలనీ సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితురాలు జె.వెంకాయమ్మ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం వెంకాయమ్మ, ఆమె భర్త బుల్లిదొర బయటకు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు గునపంతో ప్రధాన ద్వారాన్ని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని తొమ్మిదిన్నర కాసుల బంగారాన్ని దొంగిలించుకుపోయారు. ఏఎన్ఎంగా పనిచేస్తున్న వెంకాయమ్మ బుట్టాయగూడెం వైద్యశిబిరానికి వెళ్లారు. అయితే ఆ శిబిరం రద్దు కావడంతో బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడి నుంచి 11గంటల 30 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటì తలుపులు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో పెట్టిన మూడు కాసుల గాజులు, మూడు కాసుల నక్లెస్, మూడు కాసుల నల్లపూసల దండ, అరకాసు మేటీలు, రూ.ఐదువందలు, రెండు చెక్‌బుక్కులు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే తన తమ్ముడు నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, కానిస్టేబుళ్లు సి.హెచ్.రవి, కె.రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లోనే ఐమాక్స్ థియేటర్
ఐమాక్స్ థియేటర్లో తెర సాధారణ థియేటర్లో కన్నా పెద్దగా ఉంటుంది. ఐమాక్స్ తెరపై సినిమా చూడడం వల్ల ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు.. ఇక్కడ ప్రదర్శించే చిత్రాలను ఐమాక్స్ ఫార్మాట్లోనే రూపొందించాలి. సాధారణ చిత్రాలను ఈ తెరమీద ప్రదర్శించడం కుదరదు. గత ఏడాది డిసెంబర్ వరకు దాదాపు 62 దేశాల్లో 934కు పైగా ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయని ఓ అంచనా. అయితే ఇప్పటివరకు వాణిజ్య పరంగా మాత్రమే వినియోగిస్తున్న ఐమాక్స్ థియేటర్స్‌ను ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకప్పుడు 3డీ చిత్రాలు చూడాలంటే థియేటర్‌కే వెళ్లాల్సి వచ్చేది. కానీ పెరిగిన సాంకేతికత కారణంగా ఇప్పుడు 3డీ సినిమాలు, గేమ్స్ టీవీల్లోనూ వీక్షించే అవకాశం ఉంది. ఈ మార్పును ఎవరూ ఊహించి ఉండరు. ఇదే కోవలో ఇప్పుడు ఐమాక్స్ పరిజ్ఞానం కూడా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ వినియోగానికి అనువుగా ఐమాక్స్ సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని, ఇళ్లల్లోనే ఈ తరహా థియేటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని 2013లోనే ఐమాక్స్ కార్పొరేషన్ ప్రకటించింది. అనంతరం టీసీఎల్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టిన ఐమాక్స్ సంస్థ ఇటీవల తొలి ప్రైవేట్ ఐమాక్స్ తెరని రూపొందించింది. దీని పేరు ‘ప్యాలైస్’. చైనాలో తొలిసారిగా: ఐమాక్స్ కార్పొరేషన్, టీసీఎల్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన హోం స్టైల్ ఐమాక్స్ థియేటర్ ‘ప్యాలైస్’ను చైనాలోని షాంఘైలో ఆవిష్కరించారు. అసలైన ఐమాక్స్ థియేటర్ అనుభూతి కలిగేలా దీన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక సౌండ్ సిస్టం, ఫ్లోరింగ్, లైటింగ్, వాల్ ప్రొడక్షన్, సీటింగ్లను ఇందులో ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు సందర్శకులను తయారీదారులు అనుమతిస్తున్నప్పటికీ కొందరికి మాత్రమే ఈ థియేటర్లో ప్రవేశం కల్పిస్తున్నారు. దాదాపు రెండేళ్లపాటు దీని నిర్మాణంపై పరిశోధనలు సాగాయి. ఇప్పుడు ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ఐమాక్స్ థియేటర్‌ను త్వరలో అందరికీ అందుబాటులోకి తెచ్చేలా, ఇళ్లల్లోనే ఐమాక్స్ అనుభూతి కలిగేలా చేస్తామని తయారీదారులు తెలిపారు. అయితే ఈ థియేటర్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు వెల్లడించలేదు.