జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.
మద్ది ఆదాయం రూ.23.33 లక్షలు
Dec 1 2016 12:28 AM | Updated on Sep 4 2017 9:32 PM
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్‌చార్జి తనిఖీదారు ఆర్.బాలాజీ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. 30 రోజులకు గాను రూ.23,33,731 ఆదాయం వచ్చిందని, దీనిలో నోట్లు రూ.21,34,916, నాణాలు రూ.1,98,815, 3 విదేశీ కరెన్సీ నోట్లు, ఒక అమెరిక¯ŒS డాలర్ లభించాయని చెప్పారు. గతేడాది కార్తీకమాసంలో వచ్చిన ఆదాయానికి ఈసారి రూ.11,96,165 అధికంగా ఉందన్నారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు.
సోమేశ్వరస్వామి ఆదాయం రూ.1.45 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారికి కార్తీమాసం నెల రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన సొమ్ము లెక్కించగా రూ.1,4,5, 470 లభించినట్టు ఈవో నల్లూరి సతీష్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement