IN TEMPLE
-
మద్దిలో ముగిసిన హనుమద్ జయంతి
జంగారెడ్డిగూడెం రూరల్ : హనుమద్ నామ స్మరణతో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆల యం మార్మోగింది. ఈ క్షేత్రంలో జరుగుతున్న హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హనుమత్ దీక్షధారులు బుధవారం స్వామి సన్నిధిలో తమ ఇరుముళ్లను సమర్పించారు. మహా పూర్ణాహుతి హోమ గుండంలో తమ ఇరుముళ్లలోని నెయ్యిని సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు, అర్చకుల బృందం, వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పంచామృతాలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె, పసుపు, కుంకుమ, సింధూరంతో అభిషేకాలు చేశారు. ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, ఆలయ కార్వనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలను తిలకించారు. బుధవారంతో క్షేత్రంలో హనుమద్ జయంతి ఉత్సవాలు నేత్ర పర్వంగా ముగిశాయి. హంసవాహనంపై అంజన్న బుధవారం రాత్రి మద్ది ఆంజనేయస్వామి, సువర్చలాదేవి అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. హంస వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. గుర్వాయిగూడెం పుర వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవం నేత్ర పర్వంగా సాగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. -
మద్ది ఆదాయం రూ.23.33 లక్షలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్చార్జి తనిఖీదారు ఆర్.బాలాజీ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. 30 రోజులకు గాను రూ.23,33,731 ఆదాయం వచ్చిందని, దీనిలో నోట్లు రూ.21,34,916, నాణాలు రూ.1,98,815, 3 విదేశీ కరెన్సీ నోట్లు, ఒక అమెరిక¯ŒS డాలర్ లభించాయని చెప్పారు. గతేడాది కార్తీకమాసంలో వచ్చిన ఆదాయానికి ఈసారి రూ.11,96,165 అధికంగా ఉందన్నారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు. సోమేశ్వరస్వామి ఆదాయం రూ.1.45 లక్షలు భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారికి కార్తీమాసం నెల రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన సొమ్ము లెక్కించగా రూ.1,4,5, 470 లభించినట్టు ఈవో నల్లూరి సతీష్‌కుమార్ తెలిపారు. -
సత్యదేవుని సన్నిధిలో సెల్‌చల్
మంత్రాల స్థానంలో సెల్‌ఫోన్ రణగొణ ధ్వనులు పట్టించుకోని అధికారులు అన్నవరం :రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లోకి సెల్ఫోన్లు అనుమతించరు. ఆలయం వెలుపల వాటిని భద్రపరచి తిరిగి వెళ్లేటపుడు తీసుకుని వెళ్లాలి. అయితే అన్నవరం దేవస్థానంలో మాత్రం భక్తులు తమ సెల్ఫోన్లు ఆలయంలోకి తీసుకువెళ్లే వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని దేవస్థానంలో ఎక్కడ చూసినా సెల్‌ఫోన్ హల్ చల్ చేస్తోంది. వ్రత మండపాలలో, స్వామివారి ఆలయంలో, కల్యాణ మండపంలో ఇలా ఎందెందు చూసినా అందందే ప్రత్యక్షమవుతున్నాయి. వైదిక సిబ్బంది వద్ద అత్యాధునిక మైనవి.. దేవస్థానానికి వచ్చే భక్తులే కాదు, వ్రత పురోహితులు, వేదపండితులు, అర్చక స్వాములు వద్ద కూడా అత్యాధునిక సెల్ఫోన్లు రింగ్రింగమంటున్నాయి. వీరిలో ఎక్కువ మంది విధి నిర్వహణలో పాల్గొంటూనే మరోవైపు మంత్రాలు మధ్యలో ఆపేసి ఫోన్ పిలుపు రాగానే పలకరింపులకు దిగుతుండడంతో వచ్చిన భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ ఓపెన్ చేసి ముచ్చట్లకు దిగుతున్నారు. వేదపండితులు కూడా ఇదే బాట పట్టడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కక్ష సాధింపునకు ఇదో సాధనం... రెండు మూడు వర్గాలుగా చీలిపోయిన వ్రత పురోహితులు గతంలో తమ ప్రత్యర్థి వర్గం మీద అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. సెల్ఫోన్ల వాడకం పెరగడంతో ఇప్పుడు వాట్సప్, ట్విట్టర్ల ద్వారా తమ ప్రత్యర్థుల మీద అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వాటి ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటుండడంతో అధికారుల వద్ద తమ కు ఎదురు లేదనే విధంగా ఓ వర్గం కాలర్ ఎగరేయడంతో కక్షలు పెరిగిపోతున్నాయి. అవత ల వ్యక్తి తనకు దొరక్కపోతాడా అనుకుంటూ సెల్‌ఫోన్ చేతబట్టి ఫొటోలు తీయడానికి బాధి త పురోహితులు కలయ తిరుగుతున్నారు. సెల్‌ఫోన్ వాడకాన్ని నియంత్రిస్తాం : ఈఓ దేవాలయ పరిసరాలలో భక్తులు, సిబ్బంది సెల్‌ఫోన్ వాడకాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని ఈఓ కె. నాగేశ్వరరావు