సత్యదేవుని సన్నిధిలో సెల్‌చల్
-
మంత్రాల స్థానంలో సెల్‌ఫోన్ రణగొణ ధ్వనులు
-
పట్టించుకోని అధికారులు
అన్నవరం :రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించరు. ఆలయం వెలుపల వాటిని భద్రపరచి తిరిగి వెళ్లేటపుడు తీసుకుని వెళ్లాలి. అయితే అన్నవరం దేవస్థానంలో మాత్రం భక్తులు తమ సెల్‌ఫోన్లు ఆలయంలోకి తీసుకువెళ్లే వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని దేవస్థానంలో ఎక్కడ చూసినా సెల్‌ఫోన్ హల్ చల్ చేస్తోంది. వ్రత మండపాలలో, స్వామివారి ఆలయంలో, కల్యాణ మండపంలో ఇలా ఎందెందు చూసినా అందందే ప్రత్యక్షమవుతున్నాయి.
వైదిక సిబ్బంది వద్ద అత్యాధునిక మైనవి..
దేవస్థానానికి వచ్చే భక్తులే కాదు, వ్రత పురోహితులు, వేదపండితులు, అర్చక స్వాములు వద్ద కూడా అత్యాధునిక సెల్‌ఫోన్లు రింగ్‌రింగమంటున్నాయి. వీరిలో ఎక్కువ మంది విధి నిర్వహణలో పాల్గొంటూనే మరోవైపు మంత్రాలు మధ్యలో ఆపేసి ఫోన్ పిలుపు రాగానే పలకరింపులకు దిగుతుండడంతో వచ్చిన భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్ ఓపెన్ చేసి ముచ్చట్లకు దిగుతున్నారు. వేదపండితులు కూడా ఇదే బాట పట్టడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
కక్ష సాధింపునకు ఇదో సాధనం...
రెండు మూడు వర్గాలుగా చీలిపోయిన వ్రత పురోహితులు గతంలో తమ ప్రత్యర్థి వర్గం మీద అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. సెల్‌ఫోన్ల వాడకం పెరగడంతో ఇప్పుడు వాట్సప్, ట్విట్టర్ల ద్వారా తమ ప్రత్యర్థుల మీద అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వాటి ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటుండడంతో అధికారుల వద్ద తమ కు ఎదురు లేదనే విధంగా ఓ వర్గం కాలర్ ఎగరేయడంతో కక్షలు పెరిగిపోతున్నాయి. అవత ల వ్యక్తి తనకు దొరక్కపోతాడా అనుకుంటూ సెల్‌ఫోన్ చేతబట్టి ఫొటోలు తీయడానికి బాధి త పురోహితులు కలయ తిరుగుతున్నారు.
సెల్‌ఫోన్ వాడకాన్ని నియంత్రిస్తాం : ఈఓ
దేవాలయ పరిసరాలలో భక్తులు, సిబ్బంది సెల్‌ఫోన్ వాడకాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని ఈఓ కె. నాగేశ్వరరావు