పశ్చిమ డెల్టాకి నీటి విడుదల కుదింపు
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి బుధవారం సాయంత్రం నుంచి నీటి విడుదలను కుందించారు. జిల్లాలో వరినాట్లుకి నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో మూడు రోజుల నుంచి 7 వేల క్యూసెక్కులు నీరు విడుదల చేసిన అధికారులు బుధవారం సాయంత్రం పశ్చిమ డెల్టాకి వెయ్యి క్యూసెక్కులు తగ్గించి విడుదల చేస్తున్నారు.
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి బుధవారం సాయంత్రం నుంచి నీటి విడుదలను కుందించారు. జిల్లాలో వరినాట్లుకి నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో మూడు రోజుల నుంచి 7 వేల క్యూసెక్కులు నీరు విడుదల చేసిన అధికారులు బుధవారం సాయంత్రం పశ్చిమ డెల్టాకి వెయ్యి క్యూసెక్కులు తగ్గించి విడుదల చేస్తున్నారు. పెరవలిలో మంగళవారం సాగునీటి అందడం లేదని ఎమ్మెల్యేలు, నీటì æసంఘాల అధ్యక్షుడు సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటి విడుదలని మరింత కుదించి సరఫరా చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఏలూరు కాలువకు 1,147 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,914, నరసాపురం కాలువకు 2,056, గోస్తనీ (జీఅండ్ వీ) కాలువకు 898, అత్తిలి కాలువకు 663 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
సముద్రంలోకి 1.26 లక్షల క్యూసెక్కుల నీరు
గోదావరిలో వరద ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 6 గంటలకు 10.30 అడుగులున్న నీటి మట్టం సాయంత్రం 6 గంటలకు 10.20 అడుగులుగా నమోదైంది. ఆనకట్టకు ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆర్మ్‌లకు ఉన్న 109 గేట్లను 0.20 మీటర్లు, ర్యాలీ, మద్దూరు ఆర్మ్‌లలో ఉన్న 66 గేట్లను 0.30 మీటర్లు ఎత్తులేపి 1,26,688 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 12,200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.