తెలంగాణకు తరలిస్తున్న ఇసుక స్వాధీనం
Published Thu, Oct 6 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
వేలేరుపాడు : వేలేరుపాడు మండలం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మండలంలోని వసంతవాడ ప్రాంతంలోని పెదవాగు నుంచి సేకరించిన ఇసుకను రోడ్డుపైకి చేర్చి.. నాలుగు లారీల్లోకి జేసీబీతో లోడ్ చేయిస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన నాలుగు లారీలు, అశ్వారావుపేట మండలానికి చెందిన ఒక జేసీబీని సీజ్ చేసి, వేలేరుపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణాకు కారకులైన సూరారెడ్డి, యాళ్ళ శంకరంతోపాటు ఐదుగురు డ్రైవర్లపై 379, 447 సెక్షన్లతోపాటు, మైన్స్‌అండ్ మినరల్స్‡యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామచంద్రరావు తెలిపారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది గంగ, నాగేశ్వరావు, ఏపీఎస్‌పీ సిబ్బంది శంకర్,పాల్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement