సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ
Published Wed, Oct 26 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని లైసెన్స్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, దీనికోసంS నవంబరు 5లోగా కలెక్టరేట్‌లోని జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సర్వేయర్ల అవసరం ఎంతో ఉన్నదని, లైసెన్స్ ఉన్న సర్వేయర్లకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఐటీఐ, సివిల్ డ్రాఫ్ట్‌్సమెన్, డిప్లమో సివిల్, నాలుగు నెలల సర్వే శిక్షణ పొందిన వారు, ఇంటర్ ఓకేషినల్ కోర్సు చేసిన అభ్యర్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారైతే రూ.1500, ఇతర కులాల వారు అయితే రూ.3 వేలు చొప్పున వైస్ ప్రిన్సిపల్, సర్వే ట్రైనింగ్ అకాడమీ, ఏపీ హైదరాబాద్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో ధ్రువీకరించిన స్టడీ సర్టిఫికెట్లు జతపరిచి కలెక్టరేట్‌లోని ఏడీ సర్వే కార్యాలయంలో అందజేయాలని జేసీ సూచించారు.
Advertisement