ఆలయం వద్ద కెనెడా భక్తులు
తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు కెనెడా భక్తులు దర్శించుకున్నారు. కెనడాకు చెందిన ఆరుగురు వైద్యుల బృందం బర్డ్ ఆస్పత్రిలోని వైద్యసిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
సంప్రదాయ దుస్తుల్లో కెనడా భక్తుల ఆలయ సందర్శన
– శ్రీవారి దర్శనంతో తన్మయత్వం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు కెనెడా భక్తులు దర్శించుకున్నారు. కెనడాకు చెందిన ఆరుగురు వైద్యుల బృందం బర్డ్ ఆస్పత్రిలోని వైద్యసిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బుధవారం వారు ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. అందరూ ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. కట్టూబొట్టూ వేషధారణతో ఆదర్శంగా నిలిచారు. శ్రీవారిని దర్శించుకుని పరవశించారు. వీరి బృందానికి నేతృత్వం వహిస్తున్న డేమియన్ మాట్లాడుతూ, ఆలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ కట్టూబొట్టూ వేషధారణ చాలా బాగుందని, ఆలయ నిర్వహణ, పారిశుద్ధ్యం బాగుందని కితాబిచ్చారు. తర్వాత ఆలయం వద్దే ఇతర భక్తులతో కరచాలనం, సెల్ఫీలు దిగుతూ, గోవింద నామస్మరణలతో సందడి చేశారు.