అమ్మవార్లకు వెండి ఆభరణాలు
Published Wed, Oct 12 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లులో వేంచేసిన అమ్మవార్లకు భక్తులు వెండి ఆభరణాలను బహూకరించారు. పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామికి వెండి కుందు, సరస్వతీ అమ్మవారికి వెంyì కవచాన్ని విజయదశమి సందర్భంగా భక్తులు బహూకరించారు. ఆలయంలో కార్తికమాస పూజలు నిర్వహించే భక్తులు 8.500 కేజీలతో అఖండ వెండి దీపారాదన కుందును, న్యాయవాదులు కొప్పర్తి వెంకట సుబ్రహ్మణ్యం, కృష్ణవేణి దంపతులు 1.250 కేజీలతో సరస్వతీ అమ్మవారికి వెండి కవచం అందజేశారు.
స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు
కర్నాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎ.ఎన్.వేణుగోపాల గౌడ్, శ్రీకాకుళం జిల్లా అడిషినల్ సెషన్స్ జడ్జి మజ్జి బబిత విజయదశమి సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే పాలకొల్లు గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మవారికి భక్తులు వెండి కిరీటం బహూకరించారు. జ్యోతిర్మయి ఆనంద భారతి, వారి శిష్య బృందం భక్తుల సహకారంతో 2.750 కేజీలతో తయారు చేయించిన వెండి కిరీటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ధనాని సూర్యప్రకాష్, యడ్ల శివాజీ, కర్రి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement