palkol
-
క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి (క్షీరారామం) ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మూడు నెలలకు రూ.7,93,807 నగదు, మూడు విదేశీ నోట్లు లభించాయని అధికారులు తెలిపారు. ఆచంట రామేశ్వరస్వామి దేవస్థానం ఈవో కృష్ణంరాజు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ఈవో యర్రంశెట్టి భద్రాజీ, కె.శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవార్లకు వెండి ఆభరణాలు
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లులో వేంచేసిన అమ్మవార్లకు భక్తులు వెండి ఆభరణాలను బహూకరించారు. పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామికి వెండి కుందు, సరస్వతీ అమ్మవారికి వెంyì కవచాన్ని విజయదశమి సందర్భంగా భక్తులు బహూకరించారు. ఆలయంలో కార్తికమాస పూజలు నిర్వహించే భక్తులు 8.500 కేజీలతో అఖండ వెండి దీపారాదన కుందును, న్యాయవాదులు కొప్పర్తి వెంకట సుబ్రహ్మణ్యం, కృష్ణవేణి దంపతులు 1.250 కేజీలతో సరస్వతీ అమ్మవారికి వెండి కవచం అందజేశారు. స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు కర్నాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎ.ఎన్.వేణుగోపాల గౌడ్, శ్రీకాకుళం జిల్లా అడిషినల్ సెషన్స్ జడ్జి మజ్జి బబిత విజయదశమి సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పాలకొల్లు గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మవారికి భక్తులు వెండి కిరీటం బహూకరించారు. జ్యోతిర్మయి ఆనంద భారతి, వారి శిష్య బృందం భక్తుల సహకారంతో 2.750 కేజీలతో తయారు చేయించిన వెండి కిరీటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ధనాని సూర్యప్రకాష్, యడ్ల శివాజీ, కర్రి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
క్షీరపురిలో మహాకుంభాభిషేకం
పాలకొల్లు సెంట్రల్ : పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 20, 21 తేదీల్లో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గజల్స్ శ్రీనివాస్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేకం నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. ఈ మహత్కార్యానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి, కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గోగుల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నుదురుపాటి శ్రీనివాస శర్మ, సేవ్ టెంపుల్స్ జిల్లా అధ్యక్షుడు మేడికొండ శ్రీను, చల్లా ఆదినారాయణ, చల్లా గోపాలకష్ణ, బొక్కా రమాకాంత్, రావూరి చాచా, సోమంచి శ్రీనివాసశాస్త్రి, తాళ్లూరి సుబ్బారావు, బోణం చినబాబు తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
లక్ష్మీదేవికి బంగారు కిరీటం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి భక్తులు బంగారు కిరీటాన్ని సమర్పించారు. లక్ష్మీదేవి అమ్మవారికి 390 గ్రాముల బంగారు కిరీటం, 51.240 గ్రాముల బంగారు బొందు, సూత్రాలు, తురాయి, దుద్దులు, పార్వతీ అమ్మవారికి 46.220 గ్రాముల బంగారు సూత్రాలు, బొందు సమర్పించారన్నారు. అనంతరం లక్ష్మీదేవి అమ్మవారికి కిరీటం అలంకరించారు. దాతలు, ఆలయ ట్రస్టీ సభ్యులు అడ్డాల ప్రసాద్, నాళం బాబి, తమిరి వెంకటేశ్వరరావు, కోరుకొండ సుబ్బారావు, అర్చకులు నాగబాబు, మల్లేశ్వరరావు, కిష్టప్ప, భక్తులు ఆదిమూలం సోమేశ్వరరావు, కంచర్ల సాయి పాల్గొన్నారు. -
గరుడవాహన సేవలో అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని చినగోపురంలో కొలువై ఉన్న శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామివారి తిరు పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం గరుడవాహన సేవలో స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉదయం పవిత్ర ఆధివాసం, దివ్య ప్రబంధ సేవాకాలం, శ్రీ మద్రామాయణ, చతుర్వేత, భగవద్గీత, సుదర్శన శతక పారాయణ నిర్వహించారు. నరసాపురం కిడాంబి వెంకటాచార్య స్వామి, సింహాచలం దేవస్థాన ప్రధాన పురోహితులు శ్రామాన్ మోర్త సీతారామాచార్య స్వామి వార్ల శిష్య బందం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ ఈవో తమ్మిరెడ్డి బాలకష్ణ, వార్డు కౌన్సిలర్ జగ్గురోతు రాంబాబు, ఆలయ ప్రధాన అర్చకులు కరి వెంకట శ్రీనివాసాచార్యులు, పవిత్రోత్సవ కమిటీ సభ్యులు మాజేటి రాజేష్, నాళం కష్ణ, గమిని సుధాకర్, పెరుమాళ్ళ అశోక్, బంగారు రంగనా«థ్, జవ్వాజి యతీంద్ర పాల్గొన్నారు. -
బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి
పాలకొల్లు అర్బన్ : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని సహా బీసీ శంఖారావ సభలో 22 తీర్మానాలు చేసినట్టు జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు నవుడు వెంకట రమణ, జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు. పాలకొల్లులో బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్న సభలో వివిధ అంశాలపై తీర్మానాలు చేసినట్టు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను 34 శాతం నుంచి 50 శాతం పెంచి రాజ్యాంగ భద్రత కల్పించాలని, బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, కేంద్ర, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతంకు పెంచాలనే డిమాండ్లు తీర్మానాల్లో ఉన్నాయన్నారు. బీసీ కార్పొరేషన్ బడ్జెట్ ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించాలని కోరామన్నారు. బీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ నూతన కమిటీ సభ్యులతో కృష్ణయ్య ప్రమాణస్వీకారం చేయించారన్నారు. -
మొక్కోద్యమం
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం.. ప్రగతికి మెట్లు.. పచ్చని చెట్లు.. అంటూ వందలాది గొంతులు గళమెత్తాయి. గంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో విద్యార్థులు మానవహారం చేపట్టారు. ప్రకృతిని పరిరక్షిస్తాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల ఆవరణలు, రోడ్డుకిరువైపులా లక్ష మొక్కలు నాటారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్‌చైర్మన్ కర్నేన రోజారమణి, కౌన్సిలర్లు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, తమ్మినీడి సత్యనారాయణ, మేడిశెట్టి సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన త్యాగరాజ జయంత్యుత్సవాలు
పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో 4 రోజులుగా నిర్వహించిన 41వ వార్షిక త్యాగరాజ జయంత్యుత్సవాలు ఆదివారంతో ముగిశాయి. త్యాగరాజ కీర్తనల ఆలాపన, భక్తి, సంగీత పోటీలు నిర్వహించినట్టు గానసభ ప్రధాన కార్యదర్శి ద్వీపాల దక్షిణామూర్తి తెలిపారు. అలాగే చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తబలా సీనియర్స్ విభాగంలో ఎమ్.స్టీఫెన్, వరద శేషకుమార్, కె.సుమంత్, తబలా జూనియర్స్ విభాగంలో కె.బ్లెసన్, మద్దాల థామస్, వై.ఇందువర్థన్, అన్నమాచార్య కీర్తనల ఆలాపన సీనియర్స్ విభాగంలో జ్యోత్సS్న శ్రీప్రియ, ఎస్.వెంకటరత్నం, డి.రేవతి, జూనియర్స్ విభాగంలో యశశ్విని, వైడీ మహాలక్ష్మి, సమ్మత, శాస్త్రీయ సంగీత విభాగంలో టి.విష్ణు వర్థన శర్మ, ఎం.హేమర్షిణి, వైడీ మహాలక్ష్మి, పాడుతా తీయగా ఘంటశాల పాటల పోటీల్లో సీనియర్స్ విభాగంలో వీఎస్ఎన్ మూర్తి, ఎస్.వెంకటరత్నం, డి.దామోదర సాయి మణికంఠ, జూనియర్స్ విభాగంలో టి.కృష్ణ మృణాళిని దేవి, జి.జాహ్నవి, జి.శ్రీవైష్ణవి దేవి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుచుకున్నారు. విజేతలకు ఆలయ చైర్మన్ రెడ్డి నర్సింహమూర్తి, విన్నకోట వెంకటేశ్వరరావు, కొల్లు నర్సింహమూర్తి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు ఈరంకి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఎంఎన్వీ సాంబశివరావు, సహాయ కార్యదర్శి వడ్లమూడి హరికృష్ణ, కోశాధికారి రేపాక శ్రీనివాసు పాల్గొన్నారు.