గరుడవాహన సేవలో అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి
గరుడవాహన సేవలో అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి
Published Mon, Sep 12 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని చినగోపురంలో కొలువై ఉన్న శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామివారి తిరు పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం గరుడవాహన సేవలో స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉదయం పవిత్ర ఆధివాసం, దివ్య ప్రబంధ సేవాకాలం, శ్రీ మద్రామాయణ, చతుర్వేత, భగవద్గీత, సుదర్శన శతక పారాయణ నిర్వహించారు. నరసాపురం కిడాంబి వెంకటాచార్య స్వామి, సింహాచలం దేవస్థాన ప్రధాన పురోహితులు శ్రామాన్ మోర్త సీతారామాచార్య స్వామి వార్ల శిష్య బందం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ ఈవో తమ్మిరెడ్డి బాలకష్ణ, వార్డు కౌన్సిలర్ జగ్గురోతు రాంబాబు, ఆలయ ప్రధాన అర్చకులు కరి వెంకట శ్రీనివాసాచార్యులు, పవిత్రోత్సవ కమిటీ సభ్యులు మాజేటి రాజేష్, నాళం కష్ణ, గమిని సుధాకర్, పెరుమాళ్ళ అశోక్, బంగారు రంగనా«థ్, జవ్వాజి యతీంద్ర పాల్గొన్నారు.
Advertisement
Advertisement