బద్మాష్ పొట్టి సందడి
నిజామాబాద్‌కల్చరల్ : నగరంలోని తిరుమల థియేటర్‌లో సోమవారం బద్మాష్ పొట్టి హిందీ చిత్ర హీరో హీరోయిన్ ఇతర నటులు సందడి చేశారు. సోమవారం రాత్రి ఏడుగంటలకు తిరుమల థియేటర్ చిత్రం విజయోత్సవాన్ని నిర్వహించారు. హీరో ఫారుక్‌ఖాన్, హీరోయిన్ అస్మాఖాన్, విలన్ యోగిన్, కమెడియన్ రిజ్వాన్ తమ ప్రసంగాలు, అభినయాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో తిరుమల థియేటర్ మేనేజర్ కమల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.