ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం
ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం
Published Wed, May 31 2017 1:27 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
టీడీపీ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. భీమవరంలో నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
భీమవరం: తెలుగుదేశం పార్టీ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేష న్ భవనంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం ముఖ్య అతిథి ఆళ్ల నాని మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ప్రజాసమస్యలను సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లీనరీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టీడీపీ నాయకులు దోచుకు–దాచుకో పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారులపై దాడులు, ఇసుక, మట్టి మాఫియా వంటి దుశ్చర్యలతో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజల ను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని మంత్రి లోకేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ న్‌మోహ న్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేశ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేకనే అవాకులు చవాకులు పేలుతున్నారని, టీడీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని లోకేశ్ గ్రహిం చాలని నాని హితవు చెప్పారు. భీమవరం మండలం తుందుర్రులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌పై జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించి తీర్మానం చేసి రాష్ట్రస్థాయిలో చర్చకు పెడతామన్నారు.
వచ్చే నెలలో జిల్లాస్థాయి ప్లీనరీ
జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు జూ న్ 16 నుంచి మూడురోజులపాటు జిల్లాస్థాయిలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు నాని చెప్పారు. నియోజకవర్గస్థాయిల్లోని ప్రధాన సమస్యలను జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించి అవసరం మేరకు సమస్యల ప్రాధాన్యతను బట్టి రాష్ట్రస్థాయి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగ న్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామని నాని చెప్పారు.
టీడీపీ పాలనలో రాష్ట్రం నిర్వీర్యం
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించుకోలేని దుస్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని పార్టీ శ్రీకాకుళం జిల్లా ఇ న్‌చార్జ్ కొయ్యే మోషే న్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకులకే అన్నట్టు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. హామీలను గాలికొదిలి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో విసుగుచెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించడానికి కంకణబద్ధులై ఉన్నారన్నారు.
చంద్రబాబుది అవినీతి పాలన
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండగా చంద్రబాబు అవినీతి పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తీవ్రంగా దుయ్యబట్టారు.
పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వి.సాయిబాలపద్మ, ఉండి, నియోజకవర్గ కన్వీనర్లు పాతపాటి సర్రాజు, కవురు శ్రీనివాస్, పార్టీ యూత్ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల విజయనర్సింహరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్‌కుమార్, యూత్ జిల్లా అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్, నాయకులు వేగేశ్న కనకరాజు సూరి, మేడిది జాన్సన్, కోడే యుగంధర్, తిరుమాని ఏడుకొండలు, గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, చినమిల్లి వెంకట్రాయుడు, కోటిపల్లి బాబు, గుండా చిన్న, భూసారపు సాయి సత్యనారాయణ, ఆకుల సుబ్బలక్ష్మి, పాలవల్లి మంగ, బొక్కా సూర్యకుమారి, గుండా జయప్రకాష్‌నాయుడు, నాగరాజు శ్రీనివాసరాజు, మద్దాల అప్పారావు, నూకల కనకరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కామన నాగేశ్వరరావు, ముల్లి నర్సింహమూర్తి, బొల్లెంపల్లి శ్రీనివాస్, గూడూరి ఓంకారం, సుంకర బాబూరావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
తీర్మానాలివే..
నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేశారు. గృహ నిర్మాణాల్లో అవినీతి, యనమదుర్రు డ్రెయి న్‌కాలుష్యం, కంపోస్ట్‌యార్డ్ సమస్య, రక్షిత మంచినీటి పథకాల అభివృద్ధి వంటి అంశాలపై తీర్మానాలు చేశారు.
ఇది దోపిడి రాజ్యం: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం నియోజవర్గంలో టీడీపీ పాలనలో దోపిడి రాజ్యం సాగుతోందని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం 82 ఎకరాలు సేకరిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే రామాంజనేయులు ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం జీప్లస్–3 విధానంలో ఇళ్లు నిర్మిస్తామంటూ సుమారు రూ. 450 కోట్లు దోచుకోడానికి వ్యూహరచన చేశారని ఆరోపించారు. తన హయాంలో యనమదుర్రు కాలువను డెల్టా ఆధునీకరణ పథకంలో ప్రక్షాళన చేపడితే ప్రస్తుతం మున్సిపాలిటీ చెత్తతో పూడ్చుతున్నారని విమర్శించారు. భీమవరం మండలంలో తాగునీటి సమస్యను తీరుస్తానంటూ రైతుల నుంచి సేకరించిన భూమిలో ఎమ్మెల్యే రామాంజనేయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బైపాస్ రోడ్డుకు రైల్వే గేటు ఏర్పాటుచేయించలేకపోవడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement