బొజ్జగణపయ్యా.. బహురూపాయ..
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడిలో వేంచేసియున్న విద్యా గణపతిని మంగళవారం గజపుష్పమాలలతో అలంకరించారు. కంఠంశెట్టి దుర్గాప్రసాద్, నూతత గోపాలకృష్ణమూర్తి సహకారంతో ఈ అలంకరణ చేసినట్టు అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. అలాగే స్థానిక సుంకరపద్దయ్య వీధిలో వేంచేసియున్న వినాయక స్వామివారిని మంగళవారం వివిధ రకాల కాయగూరలతో శాకాంబరీ అలంకారం చేశారు. అర్చకులు బ్రహ్మజ్యోషు్యల మణికంఠశర్మ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వేద వినాయకుడు
అయి భీమవరం (ఆకివీడు) : శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల ఆవరణలో వేద వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రోజూ వేద విద్యార్థులు వినాయకుడి వద్ద నాలుగు వేదాలను వల్లిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ లింగాల సత్యనారాయణమూర్తి తెలిపారు.