Flower Decoration
-
అద్భుతమైన ప్రకృతిని.. చిన్న ప్రదేశంలో చూపించే 'ఇకబెనా ఆర్ట్'.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన ప్రకృతిని చిన్న ప్రదేశంలో చూపించే ఇకబెనా ఆర్ట్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉంది. దీనికి నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకబెనా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 35 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్క్ హోటల్లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన పూలు, ఆకులు ఇతర వస్తువులతో ఇకబెనా శైలిని ప్రదర్శించారు.ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ హోజుకి ఒయామాడ చేసిన పూల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత దేశంలోనూ ఇకబెనా కోర్సు ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జపాన్ గౌరవనీయమైన కాన్సుల్ జనరల్ తకాహషి మునియో దంపతులు, హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ రేఖారెడ్డి, ప్రెసిడెంట్ నిర్మలా అగర్వాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఇందుమతి దావ్లూర్, శారద, జ్యోత్స్న, నందరావు, శశి కోలా, రేఖా బయాంకర్, మీనాక్షి సుజనని, కనకదుర్గ, నిరూప తదితరులు భాగమయ్యారు.మేకింగ్ స్కిల్స్ బాగుంటాయి.. హైదరాబాద్‌లో ఇకబెనా ఎగ్జిబిషన్ ఎక్కడున్నా హాజరువుతా.. క్రియేటివిటీ, ఫ్లవర్ డెకరేషన్ వాటి నిర్వహన చాలా బాగుంటుంది. ఈ కోర్సు నేర్చుకోవాలంటే అధునాతన జీవన శైలిపై అవగాహన ఉండాలి. సొంతగా ఇల్లు, కంపెనీని అందంగా అలంకరించుకుంటాను. గార్డెన్‌ను సైతం మొక్కలు, రంగురంగుల పూలతో అందంగా తయారు చేసుకుంటాను. – జీవీఎస్ రామారావు, పారిశ్రామికవేత్త, మల్లాపూర్.అరుదైన కళ.. పెయింటింగ్, సింగింగ్, నృత్యం వంటి కళల్లాగే ఇకబెనా కూడా అరుదైన కళ. ఈ స్కూల్‌కు జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. మనం జపాన్ వెళ్లలేం.. కానీ ఆయా నిపుణులను నగరంలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. పదేళ్ల నుంచి ఇందులో భాగమయ్యాను. ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందాలంటే దీని లోతైన విశిష్టత అవగతమవ్వాలి. – చిలుకూరి అన్నపూర్ణ, హైదరాబాద్.ఏకాగ్రతతోనే సాధ్యం.. ఇకబెనా వినూత్నమైన కోర్సు. ఒహారా స్కూల్ ఆఫ్ ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ చేసే వ్యక్తికి కలర్ కాంబినేషన్‌పై మంచి పట్టుండాలి. సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను ప్రదర్శించగలగాలి. మేమంతా ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని స్కూల్ నడిపిస్తున్న వారు ఇందులో ఉన్నారు. – నీరజ గోదావర్తి, హైదరాబాద్ -
పూల బామ్మ పులకించిన వేళ
సంచలనాలు, అద్భుతాలు మాత్రమే ‘వైరల్’కి అర్హం కాదని నిరూపించిన వీడియో ఇది... పుణెలో ఒక బామ్మ తన పూలదుకాణంలో కూర్చొని పూలు అల్లుతుంది. నిజానికి ఇదొక సాధారణ దృశ్యం. అయితే ఈ దృశ్యంలో ఆర్టిస్ట్ చైతన్యకు శ్రమజీవన సౌందర్యం కనిపించింది. తన స్కెచ్‌బుక్ తీసి బామ్మను స్కెచ్ వేయడం ప్రారంభించాడు. స్కెచ్ పూర్తయిన తరువాత బామ్మకు చూపిస్తే... ఆమె కళ్లలో ఎంత సంతోషమో! బామ్మకు ఆ స్కెచ్ ఎంతగానో నచ్చేసింది. ‘ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే... చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా బామ్మ దృష్టి పూలమీద మాత్రమే ఉంది. పూల అల్లికలో అపారమైన ఆనందాన్ని పొందుతుంది’ అని రాశాడు చైతన్య. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇష్టమైన పనిలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని చెప్పే వీడియో ఇది’ అని కామెంట్ సెక్షన్లో స్పందించిన వారు ఎందరో. -
విరుల సోయగం
-
బొజ్జగణపయ్యా.. బహురూపాయ..
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడిలో వేంచేసియున్న విద్యా గణపతిని మంగళవారం గజపుష్పమాలలతో అలంకరించారు. కంఠంశెట్టి దుర్గాప్రసాద్, నూతత గోపాలకృష్ణమూర్తి సహకారంతో ఈ అలంకరణ చేసినట్టు అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. అలాగే స్థానిక సుంకరపద్దయ్య వీధిలో వేంచేసియున్న వినాయక స్వామివారిని మంగళవారం వివిధ రకాల కాయగూరలతో శాకాంబరీ అలంకారం చేశారు. అర్చకులు బ్రహ్మజ్యోషు్యల మణికంఠశర్మ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద వినాయకుడు అయి భీమవరం (ఆకివీడు) : శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల ఆవరణలో వేద వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రోజూ వేద విద్యార్థులు వినాయకుడి వద్ద నాలుగు వేదాలను వల్లిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ లింగాల సత్యనారాయణమూర్తి తెలిపారు. -
శ్వేతార్కుడు.. పుష్ప శోభితుడు
పట్టణంలో కొలువుదీరిన స్వయంభూ శ్వేతార్క మూలగణపతి స్వామి వారిని శనివారం అర్చకులు పూలు, గరికలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంత మల్లయ్యశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సంకష్టహర చవితిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) శ్వేతార్కుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. – కాజీపేట -
ముగిసిన సాక్షి మైత్రి ఫ్లవర్ డెకరేషన్ శిక్షణ
పటమట : సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ్లవర్ డెకరేషన్ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. పటమటలోని శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో గురు, శుక్రవారాలలో మహిళలకు ఫ్లవర్ డెకరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో ఫ్యాకల్టీ శైలజ బాస్కెట్, ఫ్లవర్, డైనింగ్ టేబుల్, హాంగింగ్ బాస్కెట్, వాటర్ పాట్, బాటిల్ ఎరేంజ్మెంట్స్, బొకే తయారీలతో పాటు మరిన్ని పుష్పాలంకరణలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు అందమైన ఫ్లవర్ బొకేలు, పాట్ డెకరేషన్లు చేశారు. దీంతో మహిళలు ఫ్లవర్ డెకరేషన్‌పై ఒక అవగాహన వచ్చిందని, ఇంట్లోనే చుట్టుపక్కల లభ్యమయ్యే ఆకులు, పువ్వులతో బొకేలుగా తయారు చేసుకోగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ తీసుకున్న మహిళలకు శ్రీగాయత్రి కళాశాల ప్రిన్సిపల్ సాంబశివరావు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సాక్షి అందించిన ఈ శిక్షణ కార్యక్రమంపై మహిళల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మెటీరియల్ సేకరణ తెలిసింది రెండు రోజుల పాటు ఫ్లవర్ డెకరేషన్‌పై శిక్షణ తీసుకున్నాం. ఫ్లవర్ డెకరేషన్ ఎలా చేయాలో తెలిసింది. బొకేస్, పాట్ డెకరేషన్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకున్నాం. ప్రధానంగా డెకరేషన్‌కు కావలసిన మెటీరియల్ ఎలా సేకరించుకోవాలో తెలుసుకున్నాం. - ఉమామహేశ్వరి డెకరేషన్‌పై అవగాహన వచ్చింది రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ద్వారా ఫ్లవర్ డెకరేషన్‌పై ఒక అవగాహన వచ్చింది. చుట్టుపక్కల ఇంటి పరిసరాలలో లభ్యమయ్యే పూలు, ఆకులతో ఏవిధంగా డెకరేషన్ చేసుకోవచ్చో తెలిసింది. బొకేస్పై అవగాహన వచ్చింది. ఇంటి వద్ద ఉండి ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటాం. - సూర్యకుమారి