ముగిసిన సాక్షి మైత్రి ఫ్లవర్ డెకరేషన్ శిక్షణ
పటమట : సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ్లవర్ డెకరేషన్ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. పటమటలోని శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో గురు, శుక్రవారాలలో మహిళలకు ఫ్లవర్ డెకరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో ఫ్యాకల్టీ శైలజ బాస్కెట్, ఫ్లవర్, డైనింగ్ టేబుల్, హాంగింగ్ బాస్కెట్, వాటర్ పాట్, బాటిల్ ఎరేంజ్‌మెంట్స్, బొకే తయారీలతో పాటు మరిన్ని పుష్పాలంకరణలపై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు అందమైన ఫ్లవర్ బొకేలు, పాట్ డెకరేషన్‌లు చేశారు. దీంతో మహిళలు ఫ్లవర్ డెకరేషన్‌పై ఒక అవగాహన వచ్చిందని, ఇంట్లోనే చుట్టుపక్కల లభ్యమయ్యే ఆకులు, పువ్వులతో బొకేలుగా తయారు చేసుకోగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ తీసుకున్న మహిళలకు శ్రీగాయత్రి కళాశాల ప్రిన్సిపల్ సాంబశివరావు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సాక్షి అందించిన ఈ శిక్షణ కార్యక్రమంపై మహిళల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
మెటీరియల్ సేకరణ తెలిసింది
రెండు రోజుల పాటు ఫ్లవర్ డెకరేషన్‌పై శిక్షణ తీసుకున్నాం. ఫ్లవర్ డెకరేషన్ ఎలా చేయాలో తెలిసింది. బొకేస్, పాట్ డెకరేషన్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకున్నాం. ప్రధానంగా డెకరేషన్‌కు కావలసిన మెటీరియల్ ఎలా సేకరించుకోవాలో తెలుసుకున్నాం.
- ఉమామహేశ్వరి
డెకరేషన్‌పై అవగాహన వచ్చింది
రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ద్వారా ఫ్లవర్ డెకరేషన్‌పై ఒక అవగాహన వచ్చింది. చుట్టుపక్కల ఇంటి పరిసరాలలో లభ్యమయ్యే పూలు, ఆకులతో ఏవిధంగా డెకరేషన్ చేసుకోవచ్చో తెలిసింది. బొకేస్‌పై అవగాహన వచ్చింది. ఇంటి వద్ద ఉండి ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటాం.
- సూర్యకుమారి