
సంచలనాలు, అద్భుతాలు మాత్రమే ‘వైరల్’కి అర్హం కాదని నిరూపించిన వీడియో ఇది... పుణెలో ఒక బామ్మ తన పూలదుకాణంలో కూర్చొని పూలు అల్లుతుంది. నిజానికి ఇదొక సాధారణ దృశ్యం. అయితే ఈ దృశ్యంలో ఆర్టిస్ట్ చైతన్యకు శ్రమజీవన సౌందర్యం కనిపించింది. తన స్కెచ్‌బుక్ తీసి బామ్మను స్కెచ్ వేయడం ప్రారంభించాడు. స్కెచ్ పూర్తయిన తరువాత బామ్మకు చూపిస్తే...
ఆమె కళ్లలో ఎంత సంతోషమో!
బామ్మకు ఆ స్కెచ్ ఎంతగానో నచ్చేసింది. ‘ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే... చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా బామ్మ దృష్టి పూలమీద మాత్రమే ఉంది. పూల అల్లికలో అపారమైన ఆనందాన్ని పొందుతుంది’ అని రాశాడు చైతన్య. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 2.4 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇష్టమైన పనిలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని చెప్పే వీడియో ఇది’ అని కామెంట్ సెక్షన్‌లో స్పందించిన వారు ఎందరో.
Comments
Please login to add a commentAdd a comment