సాక్షి, ముంబై: దేశీయ బడ్జెట్ క్యారియర్ ఎయిర్ డెక్కన్ విమాన ప్రయాణీకులకు బంపర్‌ఆఫర్ ఇచ్చింది. భారీ రుణ ఎగవేత దారుడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వినీం, సంక్షోభం, 2012లో కార్యకలాపాలు మూసివేత అనంతరం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఈ సందర్బంగా తమ కస్టమర్లకు రూ.1 కే విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది.
భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ బడ్జెట్ క్యారియర్ తొమ్మిది సంవత్సరాల తర్వాత దాని కార్యకలాపాలను పునఃప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తొలి విమానం డిసెంబర్ 22 న గాల్లోకి ఎగరనుంది. నాసిక్ నుంచి ముంబయికి ఈ సర్వీసును ప్రారంభించనున్నామని కెప్టెన్ గోపినాథ్ తెలిపారు. ప్రారంభ అదృష్టవంతులైన కొంతమంది ప్రయాణీకులు ఒక రూపాయికే టికెట్ పొందవచ్చని చెప్పారు.
కాగా ఉడాన్ పథకం కింద విమాన సర్వీసులను నడిపేందుకు అనుమతి పొందిన వాటిల్లో ఎయిర్ డెక్కన్ కూడా ఒకటి. ఈ పథకం కింద ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించేందుకు దేశంలోని లాభాపేక్షలేని, విమానాశ్రయాలను అనుసంధానించే విమానాల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో స్పైస్‌జెట్, ఎయిర్ ఒడిషా, ఎయిర్ ఇండియా అనుబంధ ఎయిర్లైన్ అల్లైడ్ సర్వీసెస్, ఎయిర్ డెక్కన్, టర్బో మెఘా అనుమతి పొందాయి. ఇవి దేశవ్యాప్తంగా 70 విమానాశ్రయాలను కలిపే 128 మార్గాల్లో విమాన సేవలు నిర్వహిస్తాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, షిల్లాంగ్ లలో తన సర్వీసులను ప్రారంభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment