చుక్కల్లో వంకాయ ధరలు
Published Sun, Oct 16 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
తాడేపల్లిగూడెం : వంకాయల ధర ఘాటెక్కించింది. గడచిన ఐదారు వారాల ధరలతో పోల్చుకుంటే ఒక్కసారిగా పెరిగింది. కిందటి వారం కిలో రూ.40 నుంచి రూ.50 వరకు ఉన్న ధర ఆదివారం ఒక్కసారిగా రూ.80కి చేరింది. నల్ల వంకాయలు కిలో రూ.60కి ఎగబాకాయి. దొండకాయలు రూ.24, ఆ కాకరకాయలు రూ.50, చిక్కుళ్లు రూ.60, దోసకాయలు రూ.24, బీరకాయలు రూ.40, బెండకాయలు రూ.40, కంద రూ.40 చేసి విక్రయించారు. క్యాబేజీ రూ.20కి లభ్యమైంది. చామదుంపలు కిలో రూ.30, టమాటాలు కిలో రూ.30, క్యారెట్ రూ.40, బీట్‌రూట్ రూ.30, కీరాదోసకాయలు రూ.30, క్యాప్సికం రూ.60కి లభించాయి. బీన్స్ రూ.60 చేసి విక్రయించారు. మిర్చి కిలో రూ.16 పలకగా గోరుచిక్కుళ్లు రూ. 32 పలికాయి. ములగకాడలు జత పది రూపాయలు, మామిడి కాయలు జత రూ.30 చేసి విక్రయించారు. ఉల్లిపాయలు కర్నూలు రకం కిలో పది రూపాయలు, మహారాష్ట్ర రకం రూ.15 చేసి అమ్మకాలు సాగించారు.
Advertisement
Advertisement