నిలకడగా కూరగాయల ధరలు
Published Sun, Nov 13 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
తాడేపల్లిగూడెం : ఉల్లిపాయలు మార్కెట్‌లో కాస్త ఘాటెక్కించినా, కూరగాయలు ధరల విషయంలో వినియోగదారుల పక్షాన నిలిచాయి. నగదులావాదేవీలపై కొనుగోళ్లు, అమ్మకాలు ప్రభావం పడినా సరుకులు భారీగానే మార్కెట్‌కు వచ్చాయి. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌లో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. కర్నూలు రకం ఉల్లిపాయలు 80 లారీల సరుకు మార్కెట్‌కు వచ్చింది.క్వింటాల్ రూ.900 వరకు అమ్మారు. మహారాష్ట్ర ఉల్లిపాయలు కేవలం మూడు లారీలు మాత్రమే వచ్చాయి. వీటి ధర క్వింటాల్ రూ.1,200 పలికింది. విడిగా కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిపాయల లావాదేవీలకు బ్రేక్ పడింది.నాలుగు రోజుల పాటు అక్కడ యార్డులకు సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వ్యాపారులు చెబుతున్నారు.
అందుబాటులో కూరగాయల ధరలు
కూరగాయల ధరలు ఈ వారం అందుబాటులోనే ఉన్నాయి. వంకాయలు కిలో రూ.30, నల్లవంకాయలు రూ.24, బెండకాయలు రూ.24, బీరకాయలు రూ.30, దోసకాయలు రూ.20, దొండకాయలు రూ.12, కంద రూ.30, కాకరకాయలు రూ.20 విక్రయించారు. ఆకాకరకాయలు రూ.32లకు అమ్మారు. క్యారట్ రూ.40, బీట్‌రూట్ రూ.30, క్యాప్సికం, బీన్స్ రూ.60, కీరా రూ.30, చిలకడదుంపలు కిలో రూ.24కు విక్రయించారు. క్యాబేజీ రూ.20, టమాటాలు కిలో రూ.15 నుంచి రూ. 20 చేసి అమ్మారు.
Advertisement