రైల్లో నుంచి జారిపడి చిన్నారి మృతి | Child Slips Away From The Narayanadri Express In Nellore | Sakshi
Sakshi News home page

రైల్లో నుంచి జారిపడి చిన్నారి మృతి

Published Fri, May 4 2018 10:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Child Slips Away From The Narayanadri Express In Nellore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు జిల్లా : కావలిలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్ ప్రెస్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ రైలులో నుంచి జారిపడి రోహిత అనే ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి.  కావలి, వెంకటేశ్వరపురం స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. గాయపడిన చిన్నారిని మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది.

ఈ ఘటనతో చిన్నారి రోహిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైలులో వాష్‌ రూంకు వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. రైలు రెండు కిలోమీటర్లు వెళ్లాక ఈ విషయం గుర్తించినట్లు తెలిసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement