narayanadri express
-
రైల్లో నుంచి జారిపడి చిన్నారి మృతి
నెల్లూరు జిల్లా : కావలిలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్ ప్రెస్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ రైలులో నుంచి జారిపడి రోహిత అనే ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. కావలి, వెంకటేశ్వరపురం స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. గాయపడిన చిన్నారిని మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. ఈ ఘటనతో చిన్నారి రోహిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైలులో వాష్ రూంకు వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. రైలు రెండు కిలోమీటర్లు వెళ్లాక ఈ విషయం గుర్తించినట్లు తెలిసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి యత్నం
ప్రకాశం: చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. రైలు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్దకు రాగానే గుర్తుతెలియని దుండగులు చైన్ లాగి రైలును నిలిపి వేసి దోపిడీకి యత్నించారు. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై.. గాలిలోకి కాల్పులు జరపారు. ఇది గుర్తించిన దుండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఈ ఘటనలో ఎమైనా దోపిడీ జరిగిందా అని రైల్వే పోలీసులను ప్రశ్నించగా.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
సాంకేతికలోపంతో నిలిచిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ : తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రైలు ఘట్కేసర్-చర్లపల్లి వద్ద నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి. రైల్వే సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు. మరోవైపు రైలు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలను అంతరాయం
భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రైలు నెంబర్ 02728: సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేసినట్లు తెలిపింది. సికింద్రాబాద్-భువనేశ్వర్ నగరాల మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ రాత్రి తొమ్మిది గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనుందని, అలాగే సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.