రైలు నుంచి పడి ప్రయాణికుడికి గాయాలు | Fell from the rail passenger injuries | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి ప్రయాణికుడికి గాయాలు

Published Sun, Aug 7 2016 12:13 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

Fell from the rail passenger injuries

కాజీపేట : రైలులో తలుపు వద్ద కూర్చొని పరిసరాలను చూస్తుండగా ఓ యువకుడు పట్టాలపై పడి తీవ్ర గాయాలపాలైన సంఘటన రఘునాథపల్లి స్టేషన్‌ సమీపంలో శనివారం చోటుచేసుకుంది.
 
కాజీపేట జీఆర్పీ ఎస్సై దయాకర్‌ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ముల్కపల్లి మండలం పాటూర్‌కు చెందిన సాద్యమ్‌ బోజి(40) మిత్రులతో కలిసి ఇటీవల కూలీ పనుల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. వర్షాకాలం కావడంతో అక్కడ ఆశించిన పనులు దొరకలేదు. దీంతో స్వగ్రామానికి చేరుకునేందుకు సికింద్రాబాద్‌లో కాకతీయ ప్యాసిం జర్‌ ఎక్కాడు. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటంతో గేట్‌ వద్ద కూర్చున్నాడు. ఈక్రమంలో రఘునాథపల్లి స్టేషన్‌ దాటిన తర్వాత వచ్చిన క్రాసింగ్‌లో కింద పడిపోయాడు. దీంతో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తిం చిన మిత్రులు కాజీపేట జీఆర్పీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అతడిని 108 వాహనంలో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement