రైలు ప్రమాదంలో యువకుడు మృతి
రైలు ప్రమాదంలో యువకుడు మృతి
Published Mon, Sep 26 2016 11:54 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఉద్యోగం కోసం వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు
రాజమహేంద్రవరం క్రైం : కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉవ్విళ్ళూరుతూ ఇంటికి చేరాల్సిన యువకుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న వాడే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరం సిద్దార్థ నగర్ కు చెందిన దాడి శివ(30) హోమ్ గార్డుగా ట్రైనింగ్ పొందేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగ నియమక పత్రంతో ఇంటికి చేరి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఆయన ఆశలు ఆవిరయ్యాయి. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తుండగా సోమవారం ఉదయం గోదావరి రైల్వే స్టేషన్‌లో రైలు నెమ్మదిగా వెళ్తుండగా రన్నింగ్ లో దిగిపోయాడు. ఈ క్రమంలో ఎదురుగా కరెంట్ స్తంభాన్ని ఢీ కొని వేగంగా వెనక్కు వచ్చి రైలు కింద పడిపోయి ఎడమ చేయి తెగిపోయి తీవ్ర గాయాలపాలైయ్యాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తీవ్ర రక్త స్రావం కావడంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వద్ద బ్యాగ్‌లో ఉన్న సర్టిఫికెట్లు, టికెట్ ఆధారంగా చిరునామా గుర్తించారు. ప్రమా దంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
శోక సముద్రంలో కుటుం సభ్యులు
మృతుడు దాడి శివకు భార్య, ఒక పాప ఉన్నారు. ఉద్యోగం సంపాదించి తమ కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కుటుంబ సభ్యుల ఆశలు అడి ఆశలయ్యాయి. ఉద్యోగ నియామక పత్రం చూపించి తమ కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకోవాలని సంతోషంతో వచ్చిన శివ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది. కుటుంబ సభ్యుల రోదనలతో ప్రభుత్వ ఆస్పత్రి మారుమ్రోగింది.
Advertisement
Advertisement