రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి | a person died in rail accident | Sakshi

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Published Thu, Jan 12 2017 10:30 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి - Sakshi

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

 
 
నరసరావుపేటటౌన్ : రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వేపోలీసుల కథనం ప్రకారం రైల్వేఫ్లాట్‌ఫాం–1 మరుగుదొడ్ల వద్ద గల రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న ౖరైల్వే ఎస్‌ఐ సత్యన్నారాయణ, హెడ్‌కానిస్టేబుల్‌ పీరాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తెల్లవారుజామున రైలుకింద పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి ఉండి 5.2అడుగుల ఎత్తు ఉన్నాడు. ఒంటిపై పాచిరంగు మోకాళ్ళవరకు చినిగిన జీన్స్‌పాంట్‌ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియావైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్ళు తెలిసినవారు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement