రైలు నుంచి జారిపడి అనంత లోకాలకు..
Published Sun, Sep 4 2016 1:03 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఏలూరు అర్బన్ : గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నూజివీడు రైల్వేస్టేçÙన్‌కు కొద్దిదూరంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం పట్టాలపై పడి ఉందని ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై రాము సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుడి వయసు 25 ఏళ్లు ఉండవచ్చని గులాబీ, నలుపు, తెలుపు గళ్ల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి, చామన చాయతో ఉన్నాడని ఎస్సై చెప్పారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94408 27572 నంబర్‌లో తెలియజేయాలని కోరారు.
Advertisement
Advertisement