unnown person
-
సీపీఐ కార్యాలయంపై దాడి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కేంద్ర కార్యాలయం (మఖ్దూం భవన్)పై ఆగంతుకులు దాడి చేశారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాచ్‌మేన్ సురేంద్రను తెలుగు అకాడమీ అడ్రస్ అడిగారు. పది నిమిషాలు అక్కడే తచ్చాడి ఆపై దాడికి పాల్పడ్డారు. కర్ర, రాళ్లతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇన్నోవా కారుపై దాడి చేశారు. దీంతో కారు ముందు అద్దం, ఎడమవైపు అద్దాలు ధ్వంస మయ్యాయి. కార్యాలయం బయట పార్క్ చేసి ఉన్న మరో కారుపై కూడా దాడి చేశారు. అనంతరం వాచ్‌మేన్‌పై కర్రతో దాడి కి యత్నించగా ఆయన బిగ్గరగా కేకలు వేశా డు. వారు మినర్వా కాఫీషాప్ వైపు వెళ్లిపోయారు. కేసు నమోదు.. సమాచారం తెలుసుకున్న ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కార్యాలయానికి చేరుకుని పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. నారాయణగూడ పోలీసులు వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, యువకుల కోసం మూడు బృందాలు గాలింపు చేపట్టాయని ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్ తెలిపారు. ఆకతాయిల పని కాదు.. ప్రజల పక్షాన నిలబడి పోరాడే తమకు ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తాము ఎండగడుతున్న కారణంగానే దాడి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దాడిపై లోతైన విచారణ జరిపించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన చాడ వెంకటరెడ్డి కారు అద్దాలు -
బెజవాడలో నడిరోడ్డుపై దారుణ హత్య
-
బెజవాడలో మరో దారుణం
సాక్షి, విజయవాడ: బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్టీఎస్ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్ మెన్ ట్రైనింగ్ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు పల్సర్ బైక్ మీద వచ్చి రాజుతో కాసేపు మాట్లాడాడు. అనంతరం రాజుని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాజు చికిత్స పొందుతూ.. చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నింధితుడు తీసుకొచ్చిన బైక్ ఆధారంగా అతను పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడికి చెందిన శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు బావమరిదే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు అర్బ¯ŒS : రైలు పట్టాలపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఏలూరు రైల్వే స్టేష¯ŒS సమీపంలోని టింబర్ డిపో వద్ద మృతదేహం పడి ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారించినా ఫలితం లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీ కొట్టడంతో మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వయసు 45 సంవత్సరాల వరకూ ఉంటుందని చెబుతున్నారు. -
ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం : ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. బస్సు డ్రైవర్, కండక్టర్ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం రాజమండ్రి నుంచి భద్రాచలం వెళుతోంది. ఈ బస్సులో రాజమండ్రిలో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. వారు జంగారెడ్డిగూడెం వరకూ టికెట్ తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి సెంటర్‌కు చేరుకునే సరికి వారిలో ఒకరు దిగిపోయారు. ఆ తర్వాత అతనితోపాటు ఎక్కిన వ్యక్తి మృతిచెందినట్టు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు గుర్తించారు. దీంతో వారు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేçÙన్కు బస్సును తీసుకువెళ్లారు. పోలీసులు అక్కడి నుంచి వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి బస్సును తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. బస్సును ఆసుపత్రి వద్దే ఉంచి మృతిచెందిన వ్యక్తి ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. బస్సు నుంచి దిగిపోయిన వ్యక్తికి సంబంధించిన బ్యాగులు బస్సులోనే ఉన్నట్టు గుర్తించారు. ఈ బ్యాగుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆ ఇద్దరు గోపాలపురం మండలం పెద్దాపురానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుడి పేరు రాజుగా భావిస్తున్నారు. ఇతనితోపాటు ఉన్న వ్యక్తి బస్సు దిగి వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. -

రైలు నుంచి జారిపడి అనంత లోకాలకు..
ఏలూరు అర్బన్ : గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నూజివీడు రైల్వేస్టేçÙన్కు కొద్దిదూరంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం పట్టాలపై పడి ఉందని ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై రాము సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుడి వయసు 25 ఏళ్లు ఉండవచ్చని గులాబీ, నలుపు, తెలుపు గళ్ల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి, చామన చాయతో ఉన్నాడని ఎస్సై చెప్పారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94408 27572 నంబర్లో తెలియజేయాలని కోరారు. -
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఏలూరు (సెంట్రల్) : రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు 40 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు ఎత్తు 5.6 అడుగులు ఉండి బ్లూ కలర్ షర్టు, జీన్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు 9440627572, 08812– 231006 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. హెడ్‌కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.