బెజవాడలో మరో దారుణం | Unknown Person Murder Attempt On Man In Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో మరో దారుణం

Published Mon, Jul 16 2018 5:02 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Unknown Person Murder Attempt On Man In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్‌టీఎస్‌ రోడ్డులో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్‌ మెన్‌ ట్రైనింగ్‌ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు పల్సర్‌ బైక్‌ మీద వచ్చి రాజుతో కాసేపు మాట్లాడాడు. అనంతరం రాజుని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాజు చికిత్స పొందుతూ.. చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నింధితుడు తీసుకొచ్చిన బైక్‌ ఆధారంగా అతను పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడికి చెందిన శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు బావమరిదే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement