బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగింది.