
కూ చుక్ చుక్‌మంటూ రైలొచ్చింది..
ఈ రైలు వెళ్లేలోపు మీకో ప్రశ్న..
ఈ రైలులో ఇంకా ఎంత మంది
ఎక్కడానికి జాగా ఉంది??
సివిల్స్ ఇంటర్వూ్యలో అడిగినా దీనికి జవాబు చెప్పడం కొంచెం కష్టమేనేమో..
చూశారుగా.. రైలులో జనం..
రైలు ముందు జనం.. రైలు మీద జనం..
ఇటు ప్లాట్‌ఫాం మీద..
పైకప్పు పైన.. చుట్టూరా జనమే జనం..
ఎవరికీ డ్రైవింగ్ రాదు కాబట్టి సరిపోయింది.. లేకుంటే ఆ రైలు డ్రైవర్‌ను కూడా దించేసేవారే..
బంగ్లాదేశ్‌లో ఓ పండుగ కోసం జనం తమతమ ఊళ్లకు వెళ్తున్నప్పుడు ఉండే రద్దీ దృశ్యాన్ని యూసఫ్ తుషార్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. 2018 నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్
ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో ‘పీపుల్స్’
విభాగంలో వచ్చిన వేలాది ఎంట్రీల్లోనుంచి
ఎడిటర్ చాయిస్ కింద కొన్ని చిత్రాలను ఎంపిక చేశారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ పోటీ విజేతలను త్వరలో ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment