రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
డోన్ టౌన్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్మామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గోపినాథ్ మాల్యా అన్నారు. డోన్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీనియర్ సెక్షన్ ఇంజినీరింగ్ కార్యాలయాన్ని మాల్యా దంపతులు సోమవారం ప్రారంభించారు. తర్వాత నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ రైల్వే డీఈ సూరబ్ కుమార్, ఏడీఏ గౌతమ్, ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి ఖాజా, రైల్వే సిబ్బంది శశిధర్, మల్లిఖార్జున, దామోదర్,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.