![Man Trolling Customer Care Executive Want Loan to Buy a Train - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/29/train.jpg.webp?itok=MNAsZ85K)
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయిన జనాలకు సోషల్ మీడియా మంచి కాలక్షేపంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని పాత జోక్‌లు మరోసారి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటి ఓ పాత ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. బ్యాంకులో పని చేసే ఓ టెలికాలర్‌కు, కస్టమర్‌కు మధ్య జరిగే సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఇది. దీనిలో టెలీకాలర్, ఓ వ్యక్తికి ఫోన్ చేసి లోన్ కావాలా అని అడుగుతుంది. తమ బ్యాంక్ కార్ లోన్, ఇంటి రుణం వంటి వాటి వేర్వేరు సేవలు అందిస్తుందని చెప్తుంది. అందుకు ఆ వ్యక్తి ‘నాకు లోన్ కావలి.. రైలు కొనాలనుకుంటున్నాను. నేను సమోసా, చిప్స్ చేస్తూ రోజుకు 1500 వందల రూపాయలు సంపాదిస్తున్నాను. నాకు బ్యాంక్ ఖాతా లేదు. కానీ రైలు కొనడానికి నాకు రూ.3000 కోట్లు లోన్ కావాలి. ఇస్తారా’ అని అడుగుతాడు. దాంతో కాల్ కట్ అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ జోక్ ప్రస్తుతం మరోసారి వైరల్‌గా మారింది.
This is hilarious.https://t.co/0FgHoHyka0
— governorswaraj (@governorswaraj) May 28, 2020
Comments
Please login to add a commentAdd a comment